శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

శనివా

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 పట్టణంలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణలో మూడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన సమీకృత మార్కెట్‌ ఇప్పటివరకు అసంపూర్తిగానే మిగిలి ఉంది. గతంలోనే రూ. 3 కోట్ల నిధులు మంజూరు కాగా, పిల్లర్లస్థాయివరకు పనులు చేసి వదిలేశారు. ఇప్ప టికైనా అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణంలోని పలు వార్డుల నుంచి వస్తున్న మురుగునీటిని బయటకు తరలించే మార్గం లేకపోవడంతో సిద్దిపేట రూట్‌లో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న మల్లె చెరువులోకి వదులుతున్నారు. దీంతో చెరువులోని నీరు కలుషితమవుతోంది. రంగు మారి దుర్వాసన వెదజల్లుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి ఐదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ. 3.20 కోట్లు మంజూరు చేయగా, పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రామాయంపేటకు ఆర్డీఓ కార్యాలయం మంజూరైనా అది బోర్డుకే పరిమితమైంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు హడావిడిగా కార్యాలయం ప్రారంభించారు. రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాలను దీని పరిధిలో చేర్చారు. అధికారికంగా ఆర్డీఓ కార్యాలయం మంజూరు కాలేదని, ఇప్పటివరకు ఇందుకు సంబంధించి గెజిట్‌ విడుదల కాలేదని ఇటీవల ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ పలుమార్లు ప్రకటించడం గమనార్హం. తాను బాధ్యతలు స్వీకరించగానే కౌన్సిలర్లతో కలిసి పట్టణంలో తిరిగి సమస్యలను పరిశీలించా. రామాయంపేటను జిల్లాలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. – లావణ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ● పట్టణంలోని కొన్ని వార్డులు, అనుబంధ గ్రామాల్లో పూర్తిగా శిథిలమైన రహదారులు, మురుగు కాలువలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. ● బస్‌డిపో నిర్మాణం కోసం పదిహేనేళ్ల క్రితం స్థలం కేటాయించి ఆర్టీసీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినా, ఇప్పటివరకు డిపో మంజూరు కాలేదు. ఎక్స్‌ప్రెస్‌ బస్టాండ్‌ నిర్మాణ హామీ నెరవేరలేదు. ● శిథిలమైన తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి గతంలో రూ. 2 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. అయితే స్లాబ్‌, పిల్లర్ల స్థాయి వరకే పనులు పూర్తయ్యాయి. ● ప్రధానంగా జాతీయ రహదారిపై హైదరాబాద్‌ వెళ్లే మార్గం నుంచి కామారెడ్డి రోడ్డును కలుపుతూ బైపాస్‌ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌రీల్‌

పట్టణవాసులకు కూరగాయాలు, మాంసం ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా ఎనిమిదేళ్ల క్రితం రూ. 50 లక్షల నిధులతో నిర్మించిన రైతుబజార్‌ను నిరుపయోగంగా వదిలేశారు. వ్యాపారానికి అనువుగా లేకపోవడంతో పట్టణ ప్రజ లు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూ పడం లేదు. వ్యాపారులు సైతం ఇందులో దుకాణాల ఏర్పాటుకు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా రూ. లక్షలు వృథా అయ్యాయి.

సమస్యల

పేట

రామాయంపేటలో కానరాని ప్రగతి

పట్టణ ప్రజలకు తప్పని పాట్లు

నూతన పాలకవర్గంపై కోటి ఆశలు

నిలిచిన

‘సమీకృత’ నిర్మాణం

రామాయంపేట మున్సిపాలిటీ ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఆశించిన ప్రగతి సాధించలేదు. ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలతో పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరతతో చాలా వరకు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈక్రమంలో నూతనంగా కొలువుదీరిన పాలకవర్గంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. – రామాయంపేట(మెదక్‌)

బోర్డు పెట్టారు.. ఆఫీస్‌ మరిచారు

ఆదర్శంగా తీర్చిదిద్దుతా

బోర్డుకే పరిమితమైన

ఆర్డీఓ కార్యాలయం

నిరుపయోగంగా

రైతు బజార్‌

మరిన్ని సమస్యలు

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/6

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/6

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20263
3/6

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20264
4/6

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20265
5/6

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20266
6/6

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement