‘వీబీజీ రామ్‌జీ’తో మరింత ఉపాధి | - | Sakshi
Sakshi News home page

‘వీబీజీ రామ్‌జీ’తో మరింత ఉపాధి

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

‘వీబీజీ రామ్‌జీ’తో మరింత ఉపాధి

‘వీబీజీ రామ్‌జీ’తో మరింత ఉపాధి

మెదక్‌ కలెక్టరేట్‌: వీబీజీ రామ్‌జీ చట్టంతో ప్రజలకు మరింత ఉపాధి లభిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంపీ రఘునందన్‌రావు సూచన మేరకు పోస్టర్‌ విడుదల చేసినట్లు తెలిపారు. నూతన ఉపాధి హామీ పథకం గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement