క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి

క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి

మెదక్‌జోన్‌: గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని, క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అవుట్‌డోర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 23 వరకు జరిగే ఈ క్రీడల్లో పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన పలువురు క్రీడాకారులను పరిచయం చేసుకొని సాఫ్ట్‌ బాల్‌ ఆడారు. కాగా పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు వచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్‌, అదనపు ఎస్పీ మహేందర్‌, డీఈఓ విజయ, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement