మల్లన్నసాగర్‌ నీటిని వదలాలి | - | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్‌ నీటిని వదలాలి

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

మల్లన్నసాగర్‌ నీటిని వదలాలి

మల్లన్నసాగర్‌ నీటిని వదలాలి

రాస్తారోకో చేస్తున్న రైతులు

చేగుంట(తూప్రాన్‌): మల్లన్నసాగర్‌ కాలువ నీటిని తమ చెరువులోకి వదలాలని వెంకటాపూర్‌ రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పులిమా మిడి గ్రామంలో రామాయంపేట– గజ్వేల్‌ రహదారిపై పురుగు మందు డబ్బాలతో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ రైతులతో పాటు గిరిజనులు మూడే ళ్లుగా కాలువ నీటిని పులిమామిడి శివారు నుంచి చెరువులో నింపుకుంటున్నామని తెలిపారు. ఈయాసంగి కోసం కాలువలో నీరు పారుతున్నా, తమ చెరువులోకి నీరు వదలకపోవడంతో 300 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని వాపోయారు. తమ చెరువులోకి నీటిని వదిలే వరకు రాస్తారోకో విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఇరిగేషన్‌ ఏఈ మమత, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు వురు అధికారులు రైతులతో మాట్లాడారు. కాలువ నీరు పారే ప్రాంతాలను పరిశీలించి రెండు రోజుల్లో చెరువును నింపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రాస్తారోకో విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement