మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ | - | Sakshi
Sakshi News home page

మహనీయుడు సంత్‌ సేవాలాల్‌

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

మహనీయుడు సంత్‌ సేవాలాల్‌

మహనీయుడు సంత్‌ సేవాలాల్‌

మెదక్‌ కలెక్టరేట్‌: బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దుర్గామీరా కాలనీలో సేవాలాల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశమంతా చిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్‌ ఏకం చేశారని కొనియాడారు. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మెదక్‌లో గిరిజనులు భారీ శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, బంజారా సంఘం పూజారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement
 
Advertisement
Advertisement