యాప్‌తోనే యూరియా బుకింగ్‌ | - | Sakshi
Sakshi News home page

యాప్‌తోనే యూరియా బుకింగ్‌

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

యాప్‌తోనే యూరియా బుకింగ్‌

యాప్‌తోనే యూరియా బుకింగ్‌

కొల్చారం(నర్సాపూర్‌): యూరియా అవసరమైన రైతులు ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే బుక్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ సూచించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యూరియా బుకింగ్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వరి పొలాలను సందర్శించారు. వరిలో జింకు లోపం లక్షణాలను గుర్తించడంతో పాటు నివారించేందుకు అవసరమైన సూచనలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో టెక్నికల్‌ ఏఓ హర్ష, మండల ఏఓ శ్వేతకుమారి, పోతంశెట్టిపల్లి క్లస్టర్‌ ఏఈఓ నిరోష, సర్పంచ్‌ దయాకర్‌గౌడ్‌, యాదయ్య, రైతులు పాల్గొన్నారు.

డీఏఓ దేవ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement