బాల్య వివాహాలను అరికడదాం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను అరికడదాం

Feb 19 2026 11:03 AM | Updated on Feb 19 2026 11:03 AM

బాల్య వివాహాలను అరికడదాం

బాల్య వివాహాలను అరికడదాం

మెదక్‌ కలెక్టరేట్‌: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో బాల్య వివాహ ముక్త్‌ భారత్‌ వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. బాల బాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం అందరి బాధ్యత అన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా సంక్షేమాధికారి హేమాభార్గవి మాట్లాడుతూ.. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పా ఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో డివిజనల్‌ పీఆర్‌ఓ రామచంద్ర రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్‌ సంతోషి, విజన్‌ సంస్థ డైరెక్టర్‌ కై లాష్‌, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లు రాజు, శరత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement