మన చరిత్ర ప్రపంచానికి చెబుదాం | - | Sakshi
Sakshi News home page

మన చరిత్ర ప్రపంచానికి చెబుదాం

Feb 19 2026 11:03 AM | Updated on Feb 19 2026 11:03 AM

మన చరిత్ర ప్రపంచానికి చెబుదాం

మన చరిత్ర ప్రపంచానికి చెబుదాం

నర్సాపూర్‌ రూరల్‌: తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని హెరిటేజ్‌ తెలంగాణ శాఖ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కూతాడి అన్నారు. బుధవారం నర్సాపూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం, హెరిటేజ్‌ తెలంగాణ శాఖ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్య ఒప్పందంతో యువతకు హెరిటేజ్‌ పరిశోధనలో అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ చరిత్రను డాక్యుమెంట్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకా శాలు, పరిశోధన సామర్థ్యాలు పెంచుతుందన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. రెండు సంస్థలు కలిసి హెరిటేజ్‌ సంరక్షణ, చరిత్ర పరిశోధనలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు ఫీల్డ్‌ వర్క్‌, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అధ్యక్షుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కూతాడి

Advertisement
 
Advertisement
Advertisement