
నిరాకరిస్తున్న బ్యాంకులు
వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయం, దాని అనుబంధ రుణాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. కానీ రైతులకు ప్రకటించిన దాంట్లో 70 శాతం మేరకే రుణాలు ఇస్తున్నారు. దీంతో రైతులు చేసేదిలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 19 రకాల బ్యాంకులు ఉండగా, వాటికి అనుబంధంగా 99 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్యాంకు రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ కొన్ని బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.
●