
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 5,277 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు పోలీస్‌స్టేషన్లలో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 313, డ్రంకెన్ డ్రైవ్, ఎంవీఐ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్ల ంఘించిన కేసులు 4,429, ఈ–పెట్టి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన, తదితర కేసులు 535 పరిష్కారం అయినట్లు తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్‌కు సంబంధించి 65 కేసులు నమోదు కాగా, 60 కేసుల్లో రూ. 12,43,343 బాధితులకు అందజేసినట్లు వివరించారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.