ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం
నర్సాపూర్ : ఎన్నికలు రావడంతో కొందరు నాయకులు వచ్చి మనం మనం ఒక్కటని, కల్లబొల్లి మాటలు చెబుతారని, అలాంటి మాటలు నమ్మొ ద్దని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కోరారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నర్సాపూర్‌లో కురుమ ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుత ఎన్నికల్లో ఆమెను గెలిపించేందుకు కుర్మలందరూ కృషి చేయాలన్నారు. అభ్యర్థి సునీతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కులవృత్తుల వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకా లు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో అసంఘటిత కార్మిక బోర్డు రాష్ట్ర చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్, సారా మల్లేశ్, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.