భైంసారూరల్:ప్రమాదవశాత్తు బావిలో జారిపడి యువకుడు మృతిచెందాడు. ఏఎస్సై జీవన్‌రావు తె లిపిన వివరాల ప్రకారం..మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోతారపోల పోశెట్టి (26) బర్రెలు కాస్తూ జీవనం సాగించేవాడు. గురువారం మ ధ్యాహ్నం గ్రామసమీపాన బావిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. బావి ఒడ్డున ఉన్న పాకూరు జారి నీటిలో మునిగి మృతిచెందాడు. విషయంతెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. తల్లి మల్లవ్వ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై తెలిపారు.
లోకేశ్వరం: రోడ్డుప్రమాదంలో గాయపడిన మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యన మృతిచెందింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గడ్‌చాంద గ్రామానికి చెందిన పీసర గంగన్న– జయ(48) దంపతులు. ఆర్మూర్ తాలు కాలోని చిన్నపూర్ గ్రామానికి జయ పుట్టింటికి దొండల వాయినాం ఇచ్చేందుకు బుధవారం బైక్‌పై వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి రాత్రి వస్తున్నారు. నగర్ గ్రామంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టెక్ చేసే క్ర మంలో బైక్ అదుపుతప్పి ఢీకొ ట్టింది. ప్రమాదంలో జయ తలకు తీవ్రగాయాలయ్యాయి. అబ్బులెన్సులో భైంసా ఏరియాస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందింది. మృతురాలికి కుమారుడు అదిశేషు, కుమారై అవంతిక ఉన్నారు. మృతురాలి చెల్లె లక్ష్మి ఫిర్యాదుతో గు రువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్సపొందుతూ యువకుడు..
లక్సెట్టిపేట: మున్సిపాలిటి పరిధిలోని సీఎస్‌ఐ చర్చి రోడ్‌లో ఉంటున్న మద్దెల వివేక్ (24) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వి వేక్ డిగ్రీ చదువు మధ్యలో ఆపేశాడు. అతని ఇద్దరు చెల్లెలు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా తాను ఖాళీగా ఉంటున్నానని మనస్తాపం చెందాడు. ఈనెల 16న ఇంటి ఆవరణలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం రాత్రి మృతి చెందాడు. తండ్రి కమలాకర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఏఐతో తుపాకీ ఫొటో సోషల్‌మీడియాలో పోస్టు
ఆదిలాబాద్‌రూరల్: ఏఐతో తుపాకీ పట్టుకుని ఉన్నట్లుగా ఫొటో రూపొందించి సోషల్ మీడియాలో పో స్టు చేసిన రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు ఆదిలా బాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. గురువా రం పోలీసుస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చిచ్‌ధరి (ఖానాపూర్)కు చెందిన రౌడీషీటర్ గైక్వాంబ్లే దలిత్ ఏఐ ద్వారా తుపాకీ రూపొందించి సోషల్ మీ డియాలో పోస్టు చేశాడు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఉండడంతో నిందితుడిపై కేసు న మోదు చేసినట్లు తెలిపారు.ఎవరైన సోషల్ మీడియా లో మారణాయుధాలతో ఫొటో, వీడియో తీసి పో స్టుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వి.విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.


