విద్యాలయ పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

విద్యాలయ పనులు వేగవంతం చేయండి

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

నస్పూర్‌: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పీ.చంద్రయ్య అన్నారు. బుధవారం నస్పూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నిర్ధేశిత గడువులోపూ పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనం, సదుపాయాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement