ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

దండేపల్లి: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నెల్కివెంకటాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మెన సుమంత్‌ (23) డిగ్రీ మధ్యలోనే ఆపేసి, కూలీ పనులకు వెళ్తున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. సదరు యువతి అతని ప్రేమను నిరాకరించింది. దీంతో అతను కొద్దిరోజులుగా ఇంట్లో దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. ఇంతలో పక్కింటికి వెళ్లిన తల్లి సత్తవ్వ ఇంటికి వచ్చి గది తలుపులు తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement