బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)లో ఓ విద్యార్థిని బుధవారం హాస్టల్–1 భవనం పై నుంచి కిందపడిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాగ్లీ హష్మతాబేగం పీ1 చదువుతోంది. బాలికల హాస్టల్ భవనంపై నుంచి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


