విద్యుత్‌తో జర భద్రం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌తో జర భద్రం

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

● వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి ● తగిన జాగ్రత్తలు పాటించాలి ● అనుమతి లేని వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూజులు మార్చడం, వీధి దీపాలను మార్చడం చేయకూడదు. ● ఇంట్లో తప్పనిసరిగా ఎర్తింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ● రేకులు పైకప్పుగా ఉన్న ఇళ్ల వద్ద విద్యుత్‌ తీగలు రేకులకు తగలకుండా జాగ్రత్త పడాలి. లేదంటే విద్యుత్‌ తీగ చిన్నగా తెగినా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ● ఇంట్లో బట్టలు ఆరవేసేందుకు దండెం కట్టే వైరు జీఏ వైరుకు దగ్గరగా లేకుండా చూసుకోవాలి. లేదంటే జీఏ తీగ ద్వారా దండానికి కట్టిన జీఏ వైరుకు విద్యుత్‌ ప్రసరించి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ● కర్రలకు విద్యుత్‌ తీగలు అమర్చిన చోటికి వెళ్లకూడదు. ● సెల్‌ చార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడకూడదు. ● విద్యుత్‌ తీగలు కిందికి ఉంటే సిబ్బందికి సమాచారం అందించి వెంటనే సరి చేయించుకోవాలి. ● ముఖ్యంగా చిన్న పిల్లలు విద్యుత్‌ పరికరాలు తాకకుండా చూడాలి. ● పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేయాల్సి వస్తే విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించాలి. ● మోటార్‌ పనిచేయని సమయాల్లో చేతితో దానిని తాక కూడదు. టెస్టర్‌ ఉపయోగించి మాత్రమే మోటార్‌ను పరీక్షించాలి. ● ఎర్తింగ్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ● వర్షం కురిస్తే తడవకుండా మోటార్‌పై రేకు అమర్చాలి. ● ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ, స్టాటర్‌ బాక్స్‌ల వద్ద పిచ్చిమొక్కలు లేకుండా చూడాలి. ● స్టాటర్లను పొడి ప్రదేశంలో మాత్రమే అమర్చాలి. వాటికి రక్షణగా కవర్లను ఉంచుకోవాలి. ● సర్వీసు తీగ తెగినప్పుడు గుడ్డ ముక్కతో అతికిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు తెగని తీగలను మాత్రమే వాడాలి. ● మోటార్ల వద్ద విద్యుత్‌ తీగలు కిందపడి ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. తీగ ఎక్కడ చిన్నగా తెగినా నడిచేటప్పుడు కానీ స్విచ్‌ ఆన్‌చేసే సమయంలో కానీ తగిలితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్‌తో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు.

చెన్నూర్‌రూరల్‌: వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్‌తో చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఇంటివద్ద, పంట పొలాల్లో విద్యుత్‌ వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో విద్యుత్‌తో బోరుబావులు, వాగుల వద్ద విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్‌ వినియోగంపై రైతులు కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలని కొమ్మెర ట్రాన్స్‌కో ఏఈ కేశెట్టి శ్రీనివాస్‌ సూచిస్తున్నారు.

ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పంట పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement