ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నాకాబందీ | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలు, నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధా న రహదారులు, పట్టణాల్లో 25 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చే శారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు 20 పోలీస్‌స్టేషన్ల పరిధిలో చేపట్టిన నాకాబందీలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్య క్తుల వేలి ముద్రలు సేకరించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలపై, సరైన పత్రాలు లేని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

మోసగించిన కేసులో మహిళ అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: డబ్బులు తీసుకుని ఇవ్వకుండా మోసగించిన కేసులో పట్టణంలోని బృందావన్‌కాలనీకి చెందిన దాసరి జ్యోతిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. గతేడాది శాంతినగర్‌కు చెందిన కొత్తపల్లి సంతోష్‌ అనే వ్యక్తికి బొజ్జ లసుంబాయి భూమిని విక్రయించింది. ఇందులో దాసరి జ్యోతి మధ్యవర్తిగా ఉంది. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని బాధితురాలికి ఇవ్వకుండా రేపు..మాపంటూ ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇది వరకే కేసు నమోదు కాగా బుధవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement