జైపూర్ మండలం గంగిపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణకు మిల్లర్లు తిరకాసు పెడుతున్నారు. బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తేనే దించుకుంటామని అంటున్నారు. తాలు, తప్ప తూర్పాల పట్టినా, తేమ శాతం 15శాతానికి లోబడి వచ్చినా తరుగు తీత తప్పదు అంటున్నారు. దీనికి ఒప్పుకోకపోవడంతో తూకం నిలిపివేశారు. గతంలో బస్తాకు 41కిలోల ప్రాతిపదిక కొన్నారు. ప్రస్తుతం మూడు కిలోల తరుగు తీస్తే నష్టపోతాం. కేంద్రంలో ధాన్యం ఆరబోసి 15 రోజులవుతోంది. భారీ వర్షం వస్తే ధాన్యం నీటి పాలవుతుంది. తరుగు తీత తగ్గించి కొనుగోలు చేయాలి. – గంగిపల్లి రైతులు


