మంచిర్యాలక్రైం: జిల్లా అటవీ శాఖ అధికారిగా రాహుల్ కిషన్ జాదవ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ములుగు జి ల్లా అటవీ శాఖ అధికారిగా ఉన్న ఆయన ఇటీవల మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఎఫ్‌డీవో, ఎఫ్‌ఆర్‌వోలు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. జిల్లాలో అటవీ సంపదను పెంపొందించేందుకు, వణ్యప్రాణుల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఎఫ్‌డీవో సర్వేశ్వర్, ఎఫ్‌ఆర్‌వో రత్నాకర్‌రావు, కార్యాలయ సూపరింటెండెంట్ పొన్నం మల్లయ్య, ఎఫ్‌ఆర్‌వోలు పాల్గొన్నారు.


