బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా తన్నీరు రమేష్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ సంపత్‌రెడ్డి ములుగు మున్సిపాల్టీకి బదిలీ కాగా, అక్కడ కమిషనర్‌గా ఉన్న రమేష్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు సంపత్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన కమిషనర్ రమేష్‌కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాగా, మున్సిపల్ ఎన్నికలకు ముందు బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఇక్కడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.


