మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములుతో కలిసి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏవో రాజేశ్వర్‌ను ఆదేశించారు.
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
● ప్రజావాణికి రాని అధికారులకు షోకాజ్ నోటీసులు ● నెన్నెల మండలం గంగారం గ్రామ పంచాయతీలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని సర్పంచ్ జాడి రాజ్‌కుమార్ కోరారు.
● ఫీజు కట్టినా సర్వే చేయడం లేదని వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామానికి చెందిన జయరాం, దండేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావడం లేదని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని గ్రామస్తుడు లక్ష్మణ్ అర్జీ అందజేశారు.
● కోతులు, కుక్కల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను రక్షించాలని తెలంగాణ పర్యావరణ, పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు జి.రాజమల్లు కోరారు.
Advertisement


