చెన్నూర్: దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం చరిత్రాత్మకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. పాండిచ్చేరి, అస్సాం, పశ్చిమబెంగాల్‌లో బీజేపీ గెలుపుపై సోమవారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధికి బెంగాల్ ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుమ్మ శ్రీపాల్, రాపర్తి వెంకటేశ్వర్, శాంతరాణి, ఎతం శివకృష్ణ, జాడి తిరుపతి, కేవీఏం శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూసారం పరీక్షించుకోవాలి
మందమర్రిరూరల్: ప్రతీ రైతు భూసారాన్ని పరీక్షించుకుని ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ అన్నారు. సోమవారం మండలంలోని సండ్రోన్‌పల్లిలో ఉన్న రైతువేదికలో భూసార పరిరక్షణ, పంటమార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడం ద్వారా భూసారం పెరిగి పంటలో నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, వ్యవసాయ అధికారి కిరణ్మయి, విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.


