పరీక్షలు అనగానే భయం ఉండేది. పేపర్ ఎట్లా వస్తుందో తెలియకపోయేది. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందించడం భరోసా కలిగించింది. ప్రతీరోజు తరగతి గదిలో చక్కగా చదువుకున్నాం. ప్రతీరోజు సాక్షి దినపత్రికలో వచ్చే మెటీరియల్(పేపర్ కటింగ్)ను ఉపాధ్యాయులు అందించేవారు. అభ్యసన సులువు కావడంతో పదో తరగతిలో 500పైగా మార్కులు సాధించాను.
– అన్వేష్, 511 మార్కులు
విద్యకు ప్రాధాన్యత..
‘సాక్షి’ దినపత్రికలో విద్య(ఎడ్యుకేషన్)కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల పిల్లల కోసం రీడింగ్ రూమ్ కార్నర్ ఏర్పాటు చేసి వీటిని(పేపర్ కటింగ్) చదువుకునేలా ప్రోత్సహించాం. గ్రూపుల వారీగా చదువుకునేలా చూశాం. సాక్షి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ఇవ్వడం.. భయం లేకుండా వార్షిక పరీక్షలు రాసేందుకు దోహద పడింది. పాఠశాల నుంచి 77 మంది పరీక్షలు రాయగా 55 మంది పాసయ్యారు. ఆరుగురు విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ‘సాక్షి’ దినపత్రికకు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు. – బండి రమేష్,
హెచ్‌ఎం, బాలుర ఉన్నత పాఠశాల


