బాసరలో భక్తుల రద్దీ
బాసర: శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి దర్శనం కోసం బారులు తీరారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు అర్చకులతో అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, ఆలయంలో వివిధ అర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.11 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.


