మహిళ కడుపులో కణతి తొలగింపు
భైంసాటౌన్: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళకు భైంసా ఏరియాస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆరు కిలోల కణతిని తొలగించారు. ముధోల్ మండలం చింతకుంటకు చెందిన చిన్నమ్మ(58) కొద్దికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో మూడురోజుల క్రితం భైంసా ఏరియాస్పత్రిలో చేరగా, పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కణతి ఉన్నట్లు గుర్తించారు. గురువారం వైద్యులు అపూర్వ, రజనీకాంత్, ప్రీతి నేతృత్వంలో మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించి, కణతి తొలగించారు. దీంతో బాధిత మహిళ కుటుంబీకులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్‌తోపాటు తోటి వైద్యులు వైద్య బృందాన్ని అభినందించారు.


