అమరచింతకు ఎంతో చారిత్రక నేపథ్యం | - | Sakshi
Sakshi News home page

అమరచింతకు ఎంతో చారిత్రక నేపథ్యం

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

నర్వ: కాకతీయులు, చాళుక్యులు, చోళులు పాలన సాగించిన ఎంతో చారిత్రక నేపథ్యం అమరచింతకు ఉందని నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు అన్నారు. గురువారం పెద్దకడ్ముర్‌లోని 800 ఏళ్ల నాటి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు నర్సింహయ్య స్వామి వారికి పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్రను వారికి వివరించారు. ఆలయ గోడలపై, రాతి స్తంభాలపై కాకతీయులు శిల్పులు చెక్కిన దేవతామూర్తులు, నాట్యమయురీలు, జంతువుల అద్బుత చిత్రాలను చూసి అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఎన్నో చారిత్రక నేపథ్యాలు కలిగిన ఆలయాలు చంద్రఘడ్‌ కోట మరెన్నో నాడు రాజులు పిలవబడ్డ అబరచింత, నేడు అమరచింతగా మారిందన్నారు. అమరచింతను నియోజకవర్గం సాధించేవరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు రామన్‌గౌడ్‌, సత్యం ఉన్నారు.

పోస్టుమార్టం రిపోర్టు

ఆలస్యంపై విచారణ

అచ్చంపేట రూరల్‌: ఓ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు ఆలస్యంపై గురువారం వైద్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్‌ 24న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతంపై మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రిలో డీసీహెచ్‌ఓ సూర్యశ్రీరావు, తన సిబ్బందితో విచారణ చేపట్టారు. అప్పట్లో విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో గంటల పాటు విచారణ చేపట్టారు. అలాగే అచ్చంపేట ఎస్‌ఐ సద్దాంహుస్సేన్‌ను విచారించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement