తళంకేరి చెరువులో మొసలి కలకలం | - | Sakshi
Sakshi News home page

తళంకేరి చెరువులో మొసలి కలకలం

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

మాగనూర్‌: మండలం కేంద్రంలోని సమాన్‌చెరువులో మొసలి కలకలం రేగింది. గ్రామస్తులు కొందరు గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో చెరువులో పశువులకు మేతకోసం అటువైపుగా వెళ్లగా మొసలి గట్టు మీదకు వచ్చి కనిపించడంతో ఒడ్డుకు పరుగులు తీశారు. చెరువులో నీరు చాలా తక్కువగా ఉన్నాయని ఫారెస్టు అధికారులు మొసలిని బంధించి మరో చోటుకు తరలించాలని గ్రామస్తులు కోరతున్నారు. అయితే గతంలో ఇదే చెరువులో మొసలి ఉందని అధికారులకు తెలియజేసిన తూతూ మంత్రంగా బ్యానర్‌ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మొసలిని బంధించి మరో ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement