
‘ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం’
జడ్చర్ల టౌన్: చట్టబద్ధతతో కూడిన 42శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ వెల్లడించారు. శుక్రవారం జడ్చర్ల ఎమ్మార్సీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీసీ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 స్థానాలు కేటాయిస్తామని మోసం చేశారని, ఇప్పుడు అదే తరహాలో 42శాతం రిజర్వేషన్లు అంటూ అమలు చేసే ఉద్దేశం లేకుండా పోయిందన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోయిందని ఆరోపించారు. చట్టబద్ధత కల్పించేందుకు త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో రజకసంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నర్సింహులు, విజయ్‌కుమార్, శ్రీనివాస్, గోపాల్, శివశంకర్ పాల్గొన్నారు.
బీసీలు ఇకనైనా మేల్కొనాలి
రాష్ట్రం ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేస్తుందని, అందుకే ఇకనైనా మేల్కొనాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్‌గౌడ్ ప్రకటనలో పిలుపునిచ్చారు. 42శాతం రిజర్వేషన్లంటూ మభ్యపెడుతున్నారని గుర్తించాలన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటీషన్లు వేసినవారు ఎవరో గుర్తించాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ఏం సమాధానం ఇస్తుందని ప్రశ్నించారు.
బంగారు షాపులో చోరీకి యత్నం
మక్తల్: పట్టణంలో బంగారు షాపులు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో నాలు గు చోట్ల దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గురువా రం రాత్రి పోలీస్ స్టేషన్ సమీపంలోని బొడ్రా యి ఎదురుగా ఉన్న విష్ణు జ్యువెలర్స్‌లో దొంగతనానికి విఫలయత్నం చేశారు. పూర్తి వివరాలు.. స్థానిక విష్ణు బంగారు దుకాణం ముందు భాగాన ఉన్న స్వెటర్ తాళాలు విరగొట్టినా ఎంతకు తెరచుకోకపోవడంతో దుకాణం వెనుక భాగాన ఉన్న గోడకు రంధ్రం వేసేందుకు ప్ర యత్నించారు. దొంగతనానికి అనుకూలంగా లేకపోవడంతో దొంగతనాన్ని విరమించుకున్నారు. దుకాణ యజమాని ముకేశ్ శుక్రవారం ఉదయం దుకాణం తెరిచేందుకు ప్రయత్నించ గా తాళాలు విరగ్గొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టా రు. ఈ క్రమంలో బస్టాండ్‌లో పలువురిని అదుపులోకి తీసుకోని వేలి ముద్రలు తీసుకున్నారు.

‘ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం’