
వేసవి ఆటలకు వేళాయే..
● ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటు
● ఈసారి ప్రత్యేకంగా ఇంట్రా
టోర్నమెంట్‌లు
● ఇతర క్రీడాంశాలకు సంబంధించి ఇదివరకే ఉచిత శిక్షణ ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: గ్రామీణ ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హెచ్‌సీఏ, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేసవిలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్ పట్టణం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానం, జడ్చర్లలోని డీఎస్‌ఏ మైదానం, నాగర్‌కర్నూల్ పట్టణం నల్లవెల్లిరోడ్డులోగల క్రికెట్ అకాడమీ, గద్వాలలోని మినీ స్టేడియం, నారాయణపేటలోని మినీ స్టేడియంలలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా శిబిరాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కోచింగ్ ఉంటుంది, ఆసక్తిగల అండర్– 9 నుంచి అండర్–23 ఏళ్లలోపు క్రీడాకారులు ఈనెల 7 తేదీ వరకు మహబూబ్‌నగర్–95023 56329, నాగర్‌కర్నూల్–89193 86105, జడ్చర్ల–99853 75737, గద్వాల–98859 55633, నారాయణపేట–91007 53683 నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. వచ్చే నెల 7వ తేదీ నెల రోజుల పాటు వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగనున్నాయి.
● శిక్షణ శిబిరాల్లో క్రీడాకారుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. క్రీడాకారుల కోసం మ్యాట్‌లు, నెట్‌లతో పాటు జంబో కిట్‌లు అందుబాటులో ఉంచుతారు. కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తారు. ప్రతిరోజు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారం కింద అరటిపండు, గుడ్లతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు.
● వేసవి శిబిరాల్లో పాల్గొనే క్రీడాకారులతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టోర్నమెంట్‌లు (ఇంట్రా డిసిక్ట్) నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23తో పాటు మహిళా టోర్నమెంట్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. టోర్నీలో రాణించే క్రీడాకారులను వచ్చేనెలలో హెచ్‌సీఏ టూ డే లీగ్ పోటీలతో పాటు అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–20, అండర్–23తో పాటు ఇతర టోర్నీలకు ఎంపిక చేయనున్నారు.
ఈ ఏడాది జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 10 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన శిబిరాల్లో ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ నిర్వహిస్తారు.
అథ్లెటిక్స్
ఫుట్‌బాల్
ఖోఖో
చిన్నచింతకుంట
మండలం అల్లీపూర్‌లోని ఇండోర్ స్టేడియం
కోచ్ డి.నవీన్ – 630482 57574
మహమ్మదాబాద్
మండల కేంద్రంలోని బాలుర జెడ్పీహెచ్‌ఎస్
కోచ్ శ్రీకాంత్–
89194 58151
దేవరకద్ర
మండలం
కోయిల్‌సాగర్
కోచ్ కనకప్ప– 97044 11541
జడ్చర్ల మండలం
గంగాపూర్
కోచ్ వడెన్న–
94407 05495
హ్యాండ్‌బాల్
జడ్చర్ల మండలం కోడ్గల్ జెడ్పీహెచ్‌ఎస్
కోచ్ రోజా –76720 35985
మిడ్జిల్ మండలం వస్సుల
కోచ్ అభిలాష్–93910 93304
ఫెన్సింగ్
జడ్చర్ల మండలం
దేవునిగుట్టతండా
కోచ్ నరేష్ కాట్రావత్– 90008 08802
కబడ్డీ
బాలానగర్ మండలం
మేడిగడ్డతండా యూపీఎస్
కోచ్ శంకర్‌నాయక్– 90149 83027
మహబూబ్‌నగర్ మండలం
గాజులపేట జెడ్పీహెచ్‌ఎస్ కోచ్
బి.రాంచందర్–9490709856
వాలీబాల్
మహ్మదాబాద్‌లోని బాలుర జెడ్పీహెచ్‌ఎస్
కోచ్ ఎజాజ్ హుస్సేన్ –9642674720
8 నుంచి ఉచిత క్రికెట్ శిబిరాలు
గ్రామీణ ప్రాంతాల్లో 10 చోట్ల శిబిరాలు
శిక్షణ శిబిరాల వివరాలు
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఐదు చోట్ల వేసవి ఉచిత క్రికెట్ శిబిరాలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలను ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. గతేడాది నిర్వహించిన వేసవి శిబిరాలకు మంచి స్పందన లభించింది. క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభ చాటుకోవాలి. శిబిరాల్లో ఆసక్తిగలవారు కేంద్రాల్లో సంప్రదించి శిక్షణ తీసుకోవాలి.
– ఎం.రాజశేఖర్,
ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి

వేసవి ఆటలకు వేళాయే..