ఎస్‌ఎల్‌బీసీ సొరంగం లోపల సహాయక చర్యలపై చేపట్టాల్సిన భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి హరీష్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్య సొరంగం లోపలి పరిస్థితులను ఆయనకు వివరించారు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అన్ని బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఉబికి వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు అధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నామని పేర్కొన్నారు.
సొరంగంలో నుంచి
బయటికి తెచ్చిన బండరాళ్లు