గళం విప్పుతాం.. నిధులు రాబడతాం | - | Sakshi
Sakshi News home page

గళం విప్పుతాం.. నిధులు రాబడతాం

Mar 12 2025 7:42 AM | Updated on Mar 12 2025 7:37 AM

పరిశ్రమల ఏర్పాటు కోసం

పేట నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణం, నియోజకవర్గంలో ప్రైవేట్‌ అద్దె భవనాల్లో కొనసాగుతున్న డిగ్రీ, జూనియర్‌ ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలకు నిధులు కావాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని కోరుతాను. – చిట్టెం పర్ణికారెడ్డి,

ఎమ్మెల్యే, నారాయణపేట

ముంపు గ్రామాలపై..

క్తల్‌ నియోజవర్గంలో ఏళ్ల తరబడిగా ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీరడం లేదు. ఈ సమస్యలను తీర్చాలని అసెంబ్లీలో చర్చిస్తా. జూరాల బ్యాక్‌ వాటర్‌లో ముంపునకు గురైన అనుగొండ, గడ్డంపల్లి, దాదాన్‌పల్లి, అంకేన్‌పల్లి గ్రామాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంగంబండ, భూత్పుర్‌ రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన ఉజ్జెల్లి, గార్లపల్లి, నేరడుగం, భూత్పుర్‌లో ఊట నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీలో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తా.

– వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్‌

అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న దీర్ఘకాల సమస్యలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగునీటి సరఫరా, నిర్వాసితుల నష్టపరిహారం, రోడ్ల విస్తరణ, విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన తదితర వాటిపై తమ గళం వినిపించి పరిష్కారానికి కృషిచేస్తామని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం నిర్వహించేది బడ్జెట్‌ సమావేశాలు కావడంతో అధికంగా నిధులు మంజూరుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

గళం విప్పుతాం.. నిధులు రాబడతాం 1
1/2

గళం విప్పుతాం.. నిధులు రాబడతాం

గళం విప్పుతాం.. నిధులు రాబడతాం 2
2/2

గళం విప్పుతాం.. నిధులు రాబడతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement