అసెంబ్లీ సమావేశాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. నూతనంగా ఏర్పడిన మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధుల కేటాయింపు, ఏదైనా ఉన్నత విద్యా సంస్థ మంజూరు, విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, జిల్లాలో పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, పెద్ద గ్రామాల్లో హెల్త్‌సెంటర్ల ఏర్పాటు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్