మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి జరుగుతుంది. మహిళలు తమ హక్కులను తెలుసుకోవాలి. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. మూఢ నమ్మకాల నుంచి బయటకు రావాలి. మారుతున్న కాలంతో పాటు మహిళల ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలపై వివక్ష సమాజంలో కొంతమేర ఉంది.. ఇది పూర్తిగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా మహిళల కోసం మహిళా శక్తి క్యాంటీన్‌ను మంజూరు చేసింది. దీన్ని విజయవంతంగా నడిపిస్తున్న మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. – విజయేందిర, కలెక్టర్