
వైర్లు తెగిపడి 11 గేదెలు మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగి పడడంతో 11 గేదెలు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు... లత్తిపురం చెందిన మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డిలకు సంబంధించిన గేదెలను శనివారం ఉదయం మేతకు తీసుకెళ్లారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు కిందపడ్డాయి. వాటిని గమనించకుండా అటువైపు వెళ్లడంతో షాక్‌గురై అక్కడిక్కడే మృత్యువాతపడ్డాయి. గమనించిన రైతులు విద్యుత్ అధికారులకు తెలియజేశారు. సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మూగజీవాలు మృతి చెందడంతో రూ.8లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందించాల్సింగా కోరారు.
రూ.8లక్షలకుపైగా నష్టం