
కరివేపాకు పంట
సెంకంపు రకంను తమిళనాడులో అధికంగా పండిస్తారు. ఆకు ఎక్కువగా ఉండి నూనె శాతం, వాసన కలిగి ఉంటాయి.
● డీడబ్ల్యూడీ–1 రకం వేరు పిలకల ద్వారా ఎన్నుకోబడింది. ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చలిని తట్టుకోలేదు. ఆకులను పొడిగా చేసి వాడుకోవచ్చు.
● డీ డబ్ల్యూ డీ–2 విత్తనాల ద్వారా వేసిన పంట రకం నుంచి ఎన్నుకోబడింది. ఆకు లేతపసుపు రంగులో ఉండి వాసన తక్కువగా ఉంటుంది. ఈ రకం చలిని తట్టుకుంటుంది. దీని పెరుగుదల అధికంగా ఉంటుంది.
● సువాసిని వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మెట్ట ప్రాంతాలకు ఇది అనుకూలం.
● భూవనేశ్వర నీటి వసతి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు అవుతుంది. అన్ని రకాల నేలల్లో పండిస్తారు. మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు శ్రేష్ఠం. ఎర్రతువ్వ నేలల్లో పెరుగుదల బాగా ఉంటుంది. ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మురుగు నీటి పారుదల లేని నల్ల నేలలు పనికి రావు.