రైతులకు మెరుగైన బ్యాంకు సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు మెరుగైన బ్యాంకు సేవలందించాలి

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

కురవి: రైతులకు వేగవంతమైన, మెరుగైన బ్యాంకు సేవలందించాలని ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వరంగల్‌ జిల్లా సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ నూతన బ్రాంచ్‌ను కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు రైతులకు సేవలందించి మన్ననలు పొందాలని సూచించారు. కురవిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షంతో నష్టపోయిన రైతుల ధాన్యం వివరాలను అధికారులు ఉన్నతాధికారులకు అందించాలన్నారు. రవాణా సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ, ఎంపీడీఓ వీరబాబు, బ్యాంక్‌ సీఈఓ నజీర్‌ సుల్తాన్‌, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మి, ఉప సర్పంచ్‌ ఎర్రనాగేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్‌, సొసైటీ చైర్మన్‌ గార్లపాటి వెంకటరెడ్డి, డీవైగిరి, నారాయణ రాజేందర్‌కుమార్‌, ఇతర బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌

డీసీసీబీ బ్రాంచ్‌ ప్రారంభం

ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు

తరలించాలి

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

Advertisement
 
Advertisement
Advertisement