వినతులు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు వెంటనే పరిష్కరించాలి

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

ప్రజావాణిలో 110 అర్జీల స్వీకరణ

మహబూబాబాద్‌: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాలతో డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజావా ణి నిర్వహిస్తారన్నారు. పెండింగ్‌ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 110 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

కొన్ని వినతులను పరిశీలిస్తే..

జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ మెస్‌ యజమాని నాగేంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపపథ్యంలో ఏర్పా టు చేసిన భోజనాలు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాల బిల్లులు ఇప్పించాలని వినతిలో పేర్కొన్నాడు. కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన కందయ్య తన ముగ్గురు కుమారులు పట్టించుకోవడం లేదని, తన ఆరోగ్యం సహకరించడం లేదని, తనకు న్యాయం చేయాలని వినతి అందజేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement