పిట్ట కొంచెం.. కూత ఘనం | - | Sakshi
Sakshi News home page

పిట్ట కొంచెం.. కూత ఘనం

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

పిట్ట కొంచెం.. కూత ఘనం

ఈ చిత్రంలో చదరంగ పావులు కదుపుతున్న చిన్నారి పేరు హయాతి. వయస్సు 6 సంవత్సరాలు, హనుమకొండ భవానీనగర్‌లోని ఓ ప్లే స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ఇప్పటి వరకు 15 వరకు టోర్నమెంట్లలో పాల్గొంది. అందులో ఐదింటిలో మొదటి స్థానంలో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. 10 నెలలుగా రాంనగర్‌లో కోచ్‌ పవన్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న హయాతి పిట్ట కొంచె కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. ప్రతి రోజు మూడు గంటలు చెస్‌ సాధన చేస్తోందని తల్లిదండ్రులు రవితేజ, సృజన చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement