నర్సంపేట: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు అజయ్‌రెడ్డి సోమవారం నర్సంపేటలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్, రాష్ట్ర యువనాయకుడు పడిదల నవీన్‌రావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, కౌన్సిలర్ వీణావిజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లుగౌడ్, నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నర్సంపేట మండల ఉపాధ్యక్షులు గజ్జి రాజు, మధు, రాజు, యూత్ కాంగ్రెస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, నాయకులు రాము, శ్రీనివాస్, గిరిగాని రమేశ్, కార్తీక్, ఆర్టీసీ ఉద్యోగులు రూపిక సుమన్, కె.రంగయ్య, మోహన్,తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
● రూ.28 లక్షల విలువైన ల్యాప్‌టాప్, ప్రింటర్స్, నకిలీ నోట్లు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
వరంగల్ క్రైం: నకిలీ నోట్లను తయారుచేసి చలామణి చేస్తున్న 8 మందిని వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ తెలి పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, రూ.1,48,000 నగదు, రూ.28 లక్షల విలువగల ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్స్, 13 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్‌కుమార్ వివరాలు వెల్లాడించారు. నిందితులు నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్, నీరటి శివ, నీరటి రంజిత్, గుడికందుల రవి, ములుగు గణపురానికి చెందిన పోరిక రాజ్‌కుమార్ అలియాస్ రాజు, ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి తాతానగర్‌కు చెందిన ముదురుకోల యాకంబరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రారకగూడేనికి చెందిన చేను సాయికిరణ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
కలర్ ప్రింట్ తీసి.. చలామణి చేసి
నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసలు రూ.100 నోట్లను ల్యాప్‌టాప్, ప్రింటర్ ద్వారా కలర్ ప్రింట్ తీసి చలామణి చేస్తున్నారని చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితులను విచారించగా తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు (1:3 నిష్పత్తి) తయారుచేసి ఇస్తామని చెప్పి రూ.500 నోట్ల పరిమాణంలో ఉన్న కాగితాలు హైపో ద్రావణంలో ముంచి నల్లగా మారిన తర్వాత ప్రజలకు ఇస్తూ మోసం చేస్తున్నారని చెప్పారు. నల్లకాగితాలు అసలు నోట్లుగా మారుతాయని నమ్మించి ప్రజల నుంచి అసలు నోట్లు తీసుకొని పరారైనట్లు ఆయన తెలిపారు. నిందితులు ములుగు గణపురం, సికింద్రాబాద్ మోండా మార్కెట్, వేంసూర్, కొత్తగూడెం, నర్సంపేట, సుబేదారి తదితర ప్రాంతాల్లో మో సం చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్, నర్సంపేట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఏఏఓ సల్మాన్‌పాషా, టాస్క్‌ఫోర్స్, నర్సంపేట సిబ్బందిని డీసీపీ అభినందించారు.


