చదరంగంలో చిచ్చరపిడుగులు | - | Sakshi
Sakshi News home page

చదరంగంలో చిచ్చరపిడుగులు

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: మేధస్సుకు ఎంత పదును పెడితే ఆట అంత రక్తి కడుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేయడమే చదరంగం. చదరంగంలో రాణించాలంటే మానసిక స్థైర్యం, ఓపిక, ఆలోచన శక్తి ఎంతో అవసరం. అలాంటి చదరంగంలో పదేళ్లు కూడా నిండని చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగుతున్నారు. జాతీయస్థాయి పతకాలు, అంతర్జాతీయ స్థాయి రేటింగ్‌తో దూసుకెళ్తున్న చిన్నారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

చెస్‌ అంటే..

చెస్‌ అంటే తెలియని వారుండరు. కానీ, ఆడడమే కొంత కష్టం. 64 బాక్సుల్లో రెండు రుక్స్‌ (ఏనుగు), రెండు నైట్స్‌ (గుర్రం), రెండు బిషప్‌ (ఒంటె), ఒక కింగ్‌ (రాజు), ఒక క్వీన్‌ (రాణి) చొప్పున ఇరు పక్షాలకు ఉంటారు. వీటితో ఇరువురు తలపడడమే చదరంగం.

చదరంగంలో విభాగాలు..

● చదరంగంలో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో క్లాసిక్‌ గంటన్నర సమయంపాటు ఆడే సుదీర్ఘమైన ఆట. అంతర్జాతీయ వేదికలపై ఈ ఆటను ఎక్కువగా ఆడుతుంటారు.

● ఐదు నిమిషాల్లోనే ఆట ముగించేది బ్రిడ్జి కాగా.. కేవలం మూడు నిమిషాలపాటు ఆడేది ర్యాపిడ్‌, ఈ ఆటలో రెండు సెకన్లు ఇంక్రిమెంట్‌గా ఇస్తారు.

● కేవలం నిమిషంలో ముగించే అత్యంత సాహోసోపేతమైనది బుల్లెట్‌ విభాగం.

ఇంటర్నేషనల్‌ రేటింగ్‌..

వయస్సుతో సంబంధం లేకుండా నాలుగు విభాగాల్లోనూ క్రీడాకారుడి ఆట తీరును లెక్కించేది రేటింగ్‌. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ రేటింగ్‌ కోసం టోర్నమెంట్‌ నిర్వహిస్తుంటారు. అందులో సాధించిన పాయింట్ల వారీగా ర్యాంకింగ్‌ కేటాయిస్తారు.

హనుమకొండలోని ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నారులకు

శిక్షణ ఇస్తున్న కోచ్‌ రాంప్రసాద్‌

చిన్న వయస్సులోనే పతకాల సాధన

అంతర్జాతీయ రేటింగ్‌తో అద్భుతాలు

Advertisement
 
Advertisement
Advertisement