ఖిలా వరంగల్: మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం మొ ద్దు నిద్ర వీడి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే వ్యవసాయ మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలు చేపట్టి చూడాలని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని, హామీలు విస్మరించిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పడం ఖాయమని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ద యాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా దిగుబడి తగ్గట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆరో పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. థంబ్ ఇంప్రెషన్ కోసం రైతుల వద్ద లంచం తీసుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 6లోపు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కోనుగోళ్లు చేపట్టక పోతే మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కా ర్యాలయాలను రైతులు ముట్టడించడం ఖాయమన్నారు. 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు అన్నదాతలు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రాకేశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, టి.రమేశ్‌బాబు, హరిరమాదేవి, లలితాయాదవ్, రాజశేఖర్, మల్లయ్య పాల్గొన్నారు.
రైతులు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం
మాజీ మంత్రి దయాకర్‌రావు,
ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శన


