● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
హన్మకొండ: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి వచ్చి చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అ ర్వింద్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్‌హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 లక్షల మందితో నిర్వహించే బహిరంగ స భకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ పంగనామాలు పెడితే.. రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్‌ఆర్‌ఐలను మోసం చేశారని, కాంగ్రెస్ పాలనలో ఏజెంట్ల మో సాలు పెరిగాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన బాజాప్తా పొలిటికల్ ట్రిప్ అన్నారు. పశ్చిమబెంగాల్‌లో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, తమిళనాడులో ఎన్డీఏ మద్దతుతో ప్రభుత్వం రానుందన్నారు. ఇ క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు. కనకదుర్గ అమ్మవారిమీద ఒ ట్టేసిన వ్యక్తి రాజకీయంగా, వ్యక్తిగతంగా నాశనమైపోతాడని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. కొందరికి పార్టీలు పెట్టడం బిజినెస్ అయిపోయిందని కల్వకుంట్ల కవిత పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించా రు. ఇక నుంచి కేసీఆర్‌కు ఎటువంటి సంబరా లుండవన్నారు. వయోభారంతో ఉన్న కేసీఆర్‌ను టీవీ చూడనివ్వొద్దని, చూస్తే తట్టుకోలేడన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, కాళీప్రసాద్, దేవేందర్‌రెడ్డి, నాయకులు కీర్తిరెడ్డి పెసరు విజయ్‌చందర్ రెడ్డి, రావుల కిషన్, చాడ స్వాతి, సండ్ర మధు పాల్గొన్నారు.


