ప్రశాంతంగా ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘నీట్‌’

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు విద్యార్థులను అనుమతించారు. అనంతరం వచ్చిన విద్యార్థులను ప్రధాన గేట్లు మూసివేసి అనుమతించలేదు. పరీక్ష కేంద్రం వద్ద డ్రెస్‌ కోడ్‌తో పాటు ఇతర నిబంధనలు కఠినంగా అమలు చేశారు. అడ్మిట్‌ కార్డు, ఫొటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోని అనుమతించారు. కాగా, పరీక్షకు 476 మంది విద్యార్థులకు గాను 459 మంది హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు. నీట్‌ ప్రవేశ పరీక్షకు భారీ పోలీసు భద్రతా చర్యలు తీసుకుమన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ అంజలి, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement