భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
● ఆలయాల్లో నాగదేవతలు,
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు
మహబూబాబాద్ రూరల్: నాగుల చవితిని పురస్కరించుకుని భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృత అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్వతీరామలింగేశ్వరస్వామి దేవాల యం, ముత్యాలమ్మ దేవాలయం, ఏ క్యాబిన్ రోడ్డులోని నాగేంద్రుడిపుట్ట వద్ద, వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయం, వేణుగోపాలస్వామివారి దేవాల యం, వేంకటేశ్వర బజార్‌లోని స్వయంభూ పార్వ తీ రామలింగేశ్వరసహిత వేంకటేశ్వరస్వామి దేవాల యం, భక్త మార్కండేయ శివాలయం, శిఖారుఖానగడ్డ ముత్యాలమ్మ దేవాలయం, నర్సంపేట రోడ్డులోని మహాగాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు.


