ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
సాక్షి, మహబూబాబాద్: ఈ చిత్రంలో పిల్లలకు షూ పంపిణీ చేస్తున్న దంపతుల పేరు యాళ్ల మురళీధర్‌రెడ్డి, సాధనారెడ్డి. వీరిది మహబూబాబాద్ పట్టణం. కుమార్తె ఆన్సారెడ్డి పుట్టిన రోజు వేడుకను పట్టణంలోని రాంచంద్రాపురం కాలనీలోని దైవ కృప అనాథాశ్రమంలోని చిన్నారులు, వృద్ధుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి.. ఆడిపాడి.. తెచ్చిన రకరకాల వంటకాలను వారితోనే కలిసి తిని తీపి జ్ఞాపకాలతో తిరిగి వచ్చారు.
ఖిలా వరంగల్: ఈ చిత్రంలో అనాథ పిల్లలకు నోట్‌బుక్స్ అందిస్తున్నది రావికంటి అశోక్, శ్రీదేవి దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వారి జన్మదిన వేడుకలను ప్రతీ ఏడాది అనాథ పిల్లల నడుమ నిర్వహిస్తున్నారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి నడుమ గడుపుతున్నారు. ఏటా హనుమకొండలోని ఒయాసిస్ చారిటబుల్ ట్రస్ట్‌లోని అనాథ పిల్లలకు రాఖీలు కట్టి, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసి వేడుకలు జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025


