
ఆదర్శ కుటుంబం..
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బజారుకు చెందిన మహమ్మద్ అఫ్జల్, సాబేరబేగం దంపతులకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కటుంబంలో 19 మంది ఒకేచోట ఉమ్మడిగా నివాసం ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహమ్మద్ అఫ్జల్, సాబేరబేగం దంపతుల కుమారులు, కోడళ్లు జమీల్–అస్మాఅంజుమ్, ఖలీల్–రెహనాపర్వీన్, షకిల్–హుమేర, ఆదిల్–నఫీస్ ఉన్నారు. అఫ్జల్, సాబేరబేగం నలుగురు కుమార్తెల్లో ఒక కుమార్తె ఖైరున్నీసాబేగం భర్త 24 సంవత్సరాల క్రితం మృతిచెందగా ఆమె కూడా వీరివద్దే ఉంటుంది. కాగా వారంతా ఒకే ఇంట్లో నివసిస్తూ సంతోషంగా ఉంటున్నారు.