
భద్రకాళీ శరణం మమః
హన్మకొండ కల్చరల్ : సర్వాభిష్టములు ఆకలిదప్పులను తీర్చి, దుష్టులను సంహరించే శాకంబరీదేవిగా భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు భద్రకాళీ శరణం మమ అంటూ పులకించారు. చారిత్రక శ్రీభద్రకాళీ దేవాలయంలో నిర్వహిస్తున్న తిథిమండల దేవాతాయజన పూర్వక శాకంబరీ నవరాత్రోత్సవాల చివరిరోజు గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని మహాశాకంబరీదేవిగా కూరగాయలతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జూన్ 26న ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం ఉత్సవాలు ప్రారంభమై పక్షం రోజులుగా ఒక్కొక్కక్రమంలో పూజలందుకుంటూ ఆషాఢశుద్ద పౌర్ణమి గురువారం అమ్మవారు పరిపూర్ణ శాకంబరీదేవిగా భక్తులను అనుగ్రహించింది. ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించిన భక్తులు భద్రకాళీ శరణం మమః అంటూ భక్తిపారవశ్యంలో మునిగారు. ఆలయ అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు అలంకరణలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్ మండువ శేషగిరిరావు, రేణుక దంపతులు, హైదరాబాద్‌కు చెందిన ఈమని హరికృష్ణ, స్మిత దంపతులు శాకంబరీ అలంకరణ దాతలుగా వ్యవహరించారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల నుంచి టన్ను పలు కూరగాయలు, పండ్లతో శాకంబరీదేవిగా అలంకరించడం ప్రారంభించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది అలుగు కృష్ణ , నాగులు, అశోక్, చింతశ్యామ్ సుందర్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
మితా, చిత్రానిత్యాక్రమాల్లో పూజలు..
ఉదయం మితా, చిత్రానిత్యాక్రమాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహాశాకంబరీదేవిగా అలంకరించి మహాహారతి, పంచహారతి, మహానివేదన జరిపారు. హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. రాత్రి వరకు కొనసాగింది. శాకంబరీ ఉత్సవాన్ని పురస్కరించుకుని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
అమ్మవారు మహాశాకంబరీదేవిగా దర్శనం
మితా, చిత్రానిత్యాక్రమంలో పూజలు
పులకించిన భక్తజనం
ఘనంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ..
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంత్రిని ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర జలు సుఖసంతోషాలు, ఆయురారో గ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరింత ముందుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మ వారి దయ ఉండాలని కోరుకున్నానన్నారు.

భద్రకాళీ శరణం మమః

భద్రకాళీ శరణం మమః

భద్రకాళీ శరణం మమః

భద్రకాళీ శరణం మమః