
కేయూ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మ దహనం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ భూములను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి యూనివర్సిటీ పాలకమండలి ఆమోదించిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్‌డీఎస్, డీఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, బీఆర్‌ఎస్‌వీ, బీఎస్‌ఎఫ్, డీఎస్‌యూ, ఎస్‌ఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో శుక్రవారం కేయూలో పాలకమండలి సభ్యుల శవయాత్ర నిర్వహించారు. హ్యూమనిటీస్ భవనం నుంచి పరిపాలన భవనం వరకు శవయాత్రను నిర్వహించి అక్కడ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ పలు చోట్ల కేయూ భూ ములు కబ్జాకు గురయ్యాయని, వాటిని వెనక్కితీసుకోవాలనే విషయంపై దృష్టిసారించకుండా యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 15ఎకరాల భూ మిని కేటాయిస్తూ పాలకమండలి సభ్యులు ఆమోదించడం శోచనీయమన్నారు. పాలకమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల బాధ్యులు గడ్డం నాగార్జున, రాష్ట్ర సావిత్రి, కామగోని శ్రావణ్, ము న్నా గణేశ్, మంద శ్రీకాంత్, స్టాలిన్, కల్యాణ్, మర్రి మహేశ్, సాయికుమార్, బైరపాక ప్రశాంత్, కమ్మరపెల్లి శివ, మధు, అన్నమయ్య, సాయి, జశ్వంత్, రా జు, నరేశ్, సురేశ్, శివ, తదితరులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు భూములు
ఇవ్వొద్దని డిమాండ్