వృద్ధురాలి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి దారుణ హత్య

Apr 14 2025 1:13 AM | Updated on Apr 14 2025 1:13 AM

వృద్ధ

వృద్ధురాలి దారుణ హత్య

గొడ్డలితో నరికి చంపిన దుండగులు

ఆదివారంపేటలో ఘటన

కాటారం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడేటి మల్లక్క(65) కిరాణం దుకాణం నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. రోజు మాదిరిగానే శనివారం రాత్రి దుకాణం మూసివేసి నిద్రకు ఉపక్రమించింది. ఆదివారం ఉదయం కిరాణంలో పాల ప్యాకెట్లు వేయడానికి వచ్చిన వ్యక్తి మల్లక్కను పిలవగా స్పందించ లేదు. దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి తలుపు తెరిచి చూడడంతో మంచంపై హత్యకు గురై ఉంది. గ్రామస్తులు, బంధువులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో మల్లక్కను నరికి హత్యకు పాల్ప డిన ఆనవాళ్లు ఉన్నాయి. కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్‌ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మల్లక్క భర్త, కుమారుడు కొంత కాలం క్రితం చనిపోగా వివాహామైన కూతురు ఉంది.

విద్యుదాఘాతంతో

మహిళ మృతి

రాయపల్లిలో ఘటన

రేగొండ: విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని రాయపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఉదయం స్నానానికి వాటర్‌ హీటర్‌ పెట్టుకుంది. అనంతరం పక్కన ఉన్న బ్రష్‌ను తీస్తుండగా విద్యుత్‌ తీగ తగిలింది. ఆ వైరు తెగి ఉండడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

మహిళా రైతుపై దాడి

నమిలిగొండలో ఘటన

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఓ మహిళా రైతుపై దాడి జరి గింది. ఈ ఘటన మండలంలోని నమిలిగొండలో చోటు చేసుకుంది. బాధిత మహిళా రైతు చి క్కుడు యాదమ్మ, ఆమె భర్త పెద్దులు కథనం ప్ర కారం.. నమిలిగొండ శివారులో సర్వే నంబర్‌ 70/ఏలో యాదమ్మ, పెద్దులు దంపతులకు మూడెకరాల ఒక గుంట వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మామిడి తోట ఉంది. ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సదురు భూ మిని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ దంపతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వ్యవసాయభూమిలోకి వెళ్తుండగా అ క్కడ ఉన్న గుర్తు తెలియని మహిళా కూలీలు యాదమ్మపై దాడికి పాల్పడ్డారు. యాదమ్మ, పెద్దులు దంపతులు భూమిలోకి రాకుండా ఐదురుగు మహిళలు, ఐదుగురు పురుషులు అడ్డుకున్నారు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వృద్ధురాలి దారుణ హత్య
1
1/2

వృద్ధురాలి దారుణ హత్య

వృద్ధురాలి దారుణ హత్య
2
2/2

వృద్ధురాలి దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement