వరి నారులో జాగ్రత్తలు అవసరం
హన్మకొండ: యాసంగిలో వరి నారు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలి సమస్యను అధిగమించడానికి నారుమడులపై ఇనుప చువ్వలతో లేదా వెదురు కర్రలతో ఊతం ఇచ్చి పల్చని పాలిథిన్ షీట్ లేదా పట్టా సాయంత్రం సమయంలో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. అలాగే వరిలో జింక్ లోపం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. నివారణకు లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే నారు తీయడానికి ఏడు రోజుల ముందు 400 గ్రాముల కార్బోఫిరాన్ 3జీ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. తద్వారా పంట తొలి దశలో చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. 25 నుంచి 30 రోజుల నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నాట్లు ఆలస్యం అయ్యే పరిస్థితిలో రెండో దఫాలో నత్రజని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూసుకోవాలి.
– డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ
పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకుడు
వరి నారులో జాగ్రత్తలు అవసరం


